బూతు సినిమాను డైరెక్ట్‌ చేయనున్న వర్మ..!!


హిట్‌లేక సతమతమవుతున్న రాంగోపాల్‌వర్మ ఇప్పుడు తన పంథాను మార్చినట్లు కనిపిస్తోంది. ఇక దెయ్యం, సస్పెన్స్‌, లవ్‌ సినిమాలను పక్కనపెట్టి ఆ అడల్ట్‌ మూవీని తీయాలని వర్మ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని, సెప్టెంబర్‌లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం.

ప్రస్తుతం వర్మ 'కిల్లింగ్‌ వీరప్పన్‌' అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత తన అడల్ట్‌ మూవీని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోర్న్‌ సినిమాల్లో హాట్‌ లేడీగా పేరొందిన టోరి బ్లాక్‌ వర్మ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ ఇండియాలో కొనసాగించడానికి నిబంధనలు ఒప్పుకోకపోవడంతో అమెరికాలోని ఓ దీవిలో ఈ సినిమా తెరకెక్కించే ప్రయత్నంలో వర్మ ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత హాట్‌ సీన్స్‌ను కట్‌ చేసి మూవీని ఇండియాలో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ వార్తలను వర్మ కొట్టిపారేశారు.

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES