Advertisement
Google Ads BL

నాగార్జున కోసం అనుష్క ఒప్పేసుకుంది..!!


తన 'సూపర్‌' చిత్రం ద్వారా అనుష్కను వెండితెరకు పరిచయం చేశాడు కింగ్‌ నాగార్జున. ఆ తర్వాత కూడా వీరిద్దరి కాంబినేషన్‌లో పలు సినిమాలు వచ్చాయి. కెరీర్‌ ఆరంభం నుంచి కూడా నాగార్జునతో అనుష్క చక్కటిస్నేహ సంబంధాలను కొనసాగిస్తోంది. తాజాగా నాగార్జున నటించనున్న ఓ సినిమాలో అతిథి పాత్ర చేయడానికి అనుష్క పచ్చజెండా ఊపింది.

Advertisement
CJ Advs

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీలు హీరోలుగా తెలుగు, తమిళ్‌ భాషల్లో ఓ మల్టీస్టారర్‌ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క అతిథి పాత్రలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈ సినిమా కథను మలుపుతిప్పే కీలకమైన పాత్ర కోసం పలువురు హీరోయిన్లను పరిశీలించిన చిత్ర యూనిట్‌ అనుష్కకు ఓటు వేసినట్లు తెలిసింది. ఇక ఇందులో నాగార్జున హీరోగా నటిస్తుండటంతో మరోమాట లేకుండా అనుష్క ఓకే చెప్పినట్లు తెలిసింది. త్వరలో అనుష్క ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననుంది. పీవీపీ పతాకంపై ప్రసాద్‌ వి. పోట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs