తమిళ స్టార్ హీరో అజిత్ స్వతహాగా వండే బిరియానికి చిత్ర పరిశ్రమలో చాలామంది ఫిదా అయిపోయారు. త్రిష, తమన్నా, అనుష్క, రాయ్‌లక్ష్మీ.. ఇలా చాలా మంది ముద్దుగుమ్మలు అజిత్ చేతి వంటను రుచి చేసి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఇప్పుడా జాబితాలో శృతిహాసన్ కూడా చేరింది. ‘వీరుడొక్కడే’ ఫేమ్ శివ దర్శకత్వంలో అజిత్ 56వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. లక్ష్మీ మీనన్ చెల్లెలుగా నటిస్తోంది. ఇటీవల శృతిహాసన్‌తో పాటు చిత్ర యూనిట్‌కు అజిత్ తన చేతి వంటను రుచి చూపించాడు. దీనిపై శృతిహాసన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ... అజిత్ మంచి వ్యక్తి మాత్రమే కాదు... చేయి తిరిగిన వంట మనిషి కూడా... ఆయన సరసన నటిస్తుండటం ఆనందంగా ఉంది. సంతోషకరమైన తరుణమిది.. అని ట్వీట్ చేసింది.