Advertisement
Google Ads BL

మీడియాపై మండిపడుతోన్న సుధీర్‌బాబు...!


సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం ఈ శుక్రవారం విడుదలై ఎబోవ్ ఏవరేజ్ టాక్‌ తెచ్చుకుంది. అయితే సుధీర్‌బాబు మాత్రం కొన్ని మీడియా వర్గాలు వారు కావాలనే తమపై కుట్రపన్ని సినిమాకు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నాడు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఓ గొడవ నడుస్తోంది. పబ్లిసిటీ ప్రచార వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం కొందరు నిర్మాతలు సిండికేట్‌గా ఏర్పడి కేవలం మూడు చానెళ్లకు మాత్రమే యాడ్స్‌ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో మిగతా చానెల్స్‌ వారు సదరు నిర్మాతల సిండికేట్‌పై ఆగ్రహంగా ఉన్నారు. ఆ నిర్మాతలు తెరకెక్కిస్తున్న చిత్రాలపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. దీంతో సదరు చిత్రాల కథానాయకుడు ఆ కొన్ని వర్గాల మీడియాపై ఆగ్రహంతో ఉన్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs