సౌతిండియన్ హాట్ బ్యూటీ అనుష్క వీలైనంత వరకు తనపై గాసిప్స్ రాకుండా జాగ్రత్తపడుతూ ఉంటుంది. అయినా ఆమెపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ ప్రచారంలో ఉంటూనే ఉంటుంది. ఇండస్ట్రీలో అందరితో ఆమె ఫ్రెండ్లీగా ఉండటమే ఇలాంటి రూమర్స్‌కు కారణం అంటున్నారు. అయితే ఇలాంటి వాటిని పట్టించుకోవడం మానేసింది ఈ కన్నడ కస్తూరి. అయితే తాజాగా అనుష్కపై ఓ పుకారు పుట్టుకొచ్చింది. లవ్‌మ్యారేజ్ చేసుకోవడానికి మొదటినుండి ఆసక్తి చూపుతున్న అనుష్క గత కొంతకాలంగా ఓ వ్యక్తితో సీక్రెట్‌గా రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేస్తోందని, అయితే కొంతకాలానికే అతనితో విభేదాలు వచ్చి బ్రేకప్ కూడా అయిపోయిందని అంటున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు? అనేది మాత్రం బయటకు పొక్కడంలేదు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న అనుష్క తనకు తగిన జోడీ కోసం అన్వేషిస్తోందిట. మరి అనుష్కకు తగిన వాడు ఎక్కడున్నాడో ఏంటో..? ఆమె వయసు మాత్రం ఇప్పటికే 33 దాటింది.