Advertisement
Google Ads BL

కోలీవుడ్‌లో మరో వివాదం!


సూపర్‌హిట్టు చిత్రం ‘పిజ్జా’ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించిన సినిమా ‘జిగర్తాండ’ తమిళ నాట ఈ చిత్రం మంచి కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొంది. ఈ సినిమాలో విలన్‌గా నటించిన బాబిసింహాకు నేషనల్‌ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడీ చిత్రం బాలీవుడ్‌లోకి రీమేక్‌ కానుంది. దక్షిణాది చిత్రాలతో మంచి హిట్లు కొట్టిన సాజిద్‌ నడియావాలా ‘జిగర్తాండ’ సినిమాను హిందీలో రీమేక్‌ హక్కులు అందుకున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్‌స్టార్‌ నటించే అవకాశాలు ఉన్నాయి.. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో ఏస్థాయి విజయం సాధించనుందో తెలీదు కానీ ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ వల్ల తమిళ ‘జిగర్తాండ’ చిత్ర దర్శకునికి, నిర్మాతకు మధ్య గొడవలు తెచ్చిపెట్టిందని చెన్నై వర్గాల సమాచారం. ఈ చిత్ర దర్శకుడు, రచయిత కార్తీక్‌ సుబ్బరాజుకు ఈ చిత్రం రైట్స్‌లో నలబై పర్సెంట్‌ షేర్‌ ఉంది. అయితే గప్‌చుప్‌గా ఈ చిత్ర నిర్మాత ఎవ్వరికీ తెలియకుండా ఈ చిత్రం రీమేక్‌రైట్స్‌ను భారీ మొత్తానికి అమ్మేశాడని తెలుసుకున్న దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్‌ నిర్మాతపై మండిపడుతున్నాడు. ఈ విషయాన్ని ఆయన డైరెక్టర్స్‌ అసోసియేషన్‌లో కంప్లైంట్‌ ఇచ్చాడు. మరి ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో వేచిచూడాల్సివుంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs