అక్కినేని ఫ్యామిలీ అంటే వారు ఖచ్చితంగా క్లాస్‌హీరోలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు. ఏయన్నార్ నుండి నాగచైతన్య వరకు ఇదే వర్కవుట్ అయింది. మధ్యలో నాగార్జున మాస్ సినిమాలు చేసి మెప్పించినా కూడా నాగ్‌కు ఇప్పటికీ ‘మన్మధుడు’ ఇమేజే ఉంది. చైతూది కూడా అదే పరిస్థితి. దీంతో నాగార్జున తన రెండో తనయుడు అక్కినేని అఖిల్ తొలి సినిమానే మాస్ చిత్రాల దర్శకుడు వినాయక్ చేతిలో పెట్టాడు. మొదటి చిత్రం నుండే అక్కినేని అభిమానుల్లో అఖిల్ అంటే మాస్ హీరో అనే ఇమేజ్ సంపాదించాలనే ఆశతో ఆయన ఉన్నాడు. తమ కుటుంబానికి ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్న మాస్‌ఇమేజ్ ముద్ర కోసం కృషి చేస్తున్నాడు. ఇప్పటివరకు అఖిల్‌కు సంబంధించిన చిత్రంలోని పోస్టర్స్, టీజర్స్ ద్వారా తాను పక్కా మాస్ పాత్ర కోసం తపన పడుతున్నట్లు అఖిల్ కనిపిస్తున్నాడు. మరి పక్కామాస్‌గా రూపొందుతున్న వినాయక్ చిత్రం అఖిల్‌కు పూర్తి స్థాయి మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి. మరి తమ ఫ్యామిలీలో మొట్టమొదటి మాస్ హీరోగా అఖిల్ పేరు తెచ్చుకుంటాడో లేదో వేచిచూడాల్సివుంది....!