ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరు స్టార్ హీరోల సరసన నటిస్తున్న లక్కీలేడీ రకుల్‌ప్రీత్‌సింగ్. కాగా ఆమె రామ్ సరసన నటించిన ‘పండగచేస్కో’ చిత్రం మే 29న విడుదలకు సిద్దమవుతోంది. ఇక ‘కిక్2’ చిత్రం జూన్ ప్రదమార్ధంలో విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఆమె మాట్లాడుతూ... రవితేజ గారు చిన్న స్థాయి నుండి బిజీస్టార్‌గా మారడం హార్డ్‌వర్క్ వల్లే సాధ్యమైంది. ఇప్పుడు ఆయన కష్టమే ఆయనను ఆ స్థాయిలో నిలబెట్టింది. అలాంటి రవితేజ గారు... నన్ను చూసినప్పుడల్లా నిన్ను చూస్తే నాకు నేనే గుర్తొస్తున్నాను. బాగా కష్టపడటం నీలో నాకు నచ్చే అంశం అనడం నాలో మరింత ఉత్తేజాన్ని నింపుతోంది.. అని చెప్పుకొచ్చింది.