నాని... కేవలం సొంత టాలెంట్‌తో ఎవ్వరి అండదండలు లేకుండా హీరోగా ఎదిగి, వరుస హిట్లతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత అతని కెరీర్ కొంత కాలం ఆటుపోట్లకు గురైంది. కాగా ఇటీవల విడుదలైన ‘జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాలతో ఫర్వాలేదనిపించుకున్నాడు. తాజాగా ఆయన మారుతి డైరెక్షన్‌లో ‘భలే భలే మగాడివోయ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన వెంటనే ‘అందాల రాక్షసి’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో 14రీల్స్ సంస్థలో ఓ చిత్రం చేయనున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ పూర్తయింది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.