ప్రభాస్‌పై కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబు అలిగాడు. ‘నీతో మాట్లడకూడదు. ఐ హర్ట్.. అంటూ మూతి తిప్పుకున్నాడు. మంచు మనోజ్ పెళ్లిలో ఈ సరదా సంఘటన చోటు చేసుకొంది. పెళ్లికి ఆలస్యంగా వచ్చినందుకు మోహన్‌బాబు ప్రభాస్‌పై అలకపూనాడు. ఆలస్యంగా రావడమే కాదు.. ఇంట్లో వాళ్లని తీసుకురాలేదని ఫీలయ్యాడు. ప్రభాస్ కూడా మోహన్‌బాబును కాసేపు ఆటపట్టించి నవ్వించేశాడు. ‘బుజ్జిగాడు’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. దాంతో చనువు కొద్ది వీరిద్దరూ కాసేపు అలా అందరి చూపును తమవైపుకు తిప్పుకున్నారు.