నాగచైతన్య హీరోగా కృతిసనన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘దోచెయ్’. ఈ చిత్రానికి సుధీర్‌వర్మ దర్శకుడు. రిలయన్స్ సంస్థ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లి. బేనర్‌లో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందు చాలా అంచనాలు రేపింది. నాగచైతన్య కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని అందరూ బావించిన ఈ చిత్రం విడుదలైన మొదటి షో నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 14కోట్లకు అమ్ముడైన ఈ చిత్రం కేవలం 7కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి అందరినీ మరీ ముఖ్యంగా బయ్యర్లను నిలువునా ముంచేసింది. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాకపోవడంతో పంపిణీదారులు తీవ్ర నష్టాలను చవిచూశారు. అయితే నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాత్రం నష్టపోయిన పంపిణీదారులను పిలిచి ‘దోచెయ్’ నష్టాలను పూడ్చేందుకు తాను త్వరలో నిర్మిస్తున్న ఎన్టీఆర్-సుకుమార్ చిత్రాన్ని వాళ్లకే పంపిణీహక్కులు ఇస్తానని మాట ఇవ్వడంతో నష్టపోయిన బయ్యర్లు కాస్త శాంతించి ఎన్టీఆర్-సుకుమార్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.