Advertisement
Google Ads BL

రీమేక్‌లో రజనీకాంత్‌....!


సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ త్వరలో ఓ రీమేక్‌ చిత్రంలో నటించనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. రీసెంట్‌గా ఆయన ముమ్ముట్టి, నయనతార కలిసి నటించిన ‘భాస్కర్‌ ది రాస్కెల్‌’ చిత్రం చూడటం జరిగిందని, దాంతో ఆ చిత్రం రీమేక్‌ చేస్తే బాగుంటుందని రజనీ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మలయాళంలో సిద్దికి ‘బాడీగార్డ్‌’ డైరెక్టర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం కూడా మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో రజనీకి ఈ చిత్రం స్పెషల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు. అయితే ఈ చిత్రంలో హీరో వివాహితుడుగా, ఓ బిడ్డకు తండ్రిగా కనిపించాల్సివుంది. అది రజనీ అభిమానులను ఏ మాత్రం ఆకట్టుకుంటుందో అని కొందరు మల్లగుల్లాలు పడుతున్నారు. రజనీ మాత్రం ఈ చిత్రంలోని హీరో క్యారెక్టర్‌ తన వయసుకు తగ్గట్లుగా ఉంటుందని భావిస్తున్నాడట. మరి ఈ చిత్రానికి తమిళం, తెలుగలో చేయడానికి రజనీ అనుకూలంగా ఉండటంతో ఈ చిత్రం ఖచ్చితంగా పట్టాలెక్కుతుందని అంటున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs