Advertisement
Google Ads BL

పూరీ దూకుడుకు మెగాకాంపౌండ్‌ అడ్డుకట్ట వేస్తోందా?


ఎంతటి స్టార్‌ హీరో చిత్రమైనా, లేక ‘జ్యోతిలక్ష్మీ’ లాంటి చిన్న చిత్రమైనా సరే ఒక్కసారి పట్టాలెక్కిన తర్వాత వాయు వేగంతో సినిమాలు తీయడంలో పూరీజగన్నాథ్‌ సిద్దహస్తుడు. ఆయన ఏ సినిమా తీసినా అలానే ఉంటుంది. అదే విధంగా స్టోరీ అంతా ఓకే అయి, బైండెడ్‌ స్క్రిప్ట్‌ పూర్తయిన వెంటనే చిరంజీవి 150 వచిత్రం పట్టాలెక్కించి మూడు నెలల్లో సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలనేది పూరీ సంకల్పంగా తెలుస్తోంది. అయితే మెగా హీరోల చిత్రాల విషయంలో అది సాథ్యం కాకపోవచ్చు.

Advertisement
CJ Advs

ఇప్పటికే తన తనయుడు రామ్‌చరణ్‌ నటించే చిత్రాలను నిశితంగా గమనిస్తూ... ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ, కాస్టింగ్‌ నుండి సీన్స్‌, డైలాగ్స్‌ వరకు ప్రతి విషయాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న చిరంజీవి ఇక తన 150 వ చిత్రం అంటే ఊరికే ఉంటాడా? పూరికి అంత స్వేచ్ఛ ఇస్తాడా? మూడు నెలల్లోనే షూటింగ్‌ పూర్తి చేసి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్న పూరీకి అందుకు సహకరిస్తాడా? అనే డౌట్‌ పూరీ సన్నిహితులను సందిగ్దంలో పడేసింది. ఇక మెగా ఫ్యామిలీకి పరుచూరి బ్రదర్స్‌పై ఎనలేని నమ్మకం. దాంతో చిరు 150 వచిత్రం విషయంలో పరుచూరి బ్రదర్స్‌ సలహాలు కూడా తప్పకతీసుకోవాల్సిన పరిస్థితి పూరీకి ఏర్పడవచ్చు. మరి మెగాహీరోల మైండ్‌సెట్‌కు అనుగుణంగా పూరీ వెళ్లక తప్పని పరిస్థితి ఉందని అర్థమవుతోంది. 

 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs