2014లో అసలు బోణీనే చేయలేదు. కానీ ఆ తర్వాత మాత్రం వేగం పెంచాడు. ఈ ఏడాదిలో ఎలాగైనా మూడు చిత్రాలను వెండితెరపైకి తెచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. వరుస పరాజయాల తర్వాత ఈ హీరో నటించిన ‘పండగచేస్కో’ చిత్రం త్వరలో విడుదలకానుంది. ఇక ఆయన నటిస్తున్న మరో రెండు చిత్రాలు సెట్స్‌పైకి వెళ్లాయి. శ్రీనివాసరెడ్డి అనే నూతన దర్శకునితో ‘శివం’ చిత్రం చేస్తున్నాడు. ఇందులో రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ‘సెకండ్‌హ్యాండ్’ ఫేమ్ కిషోర్ తిరుమల శెట్టి దర్శకత్వంలో ‘హరికథ’ చిత్రం చేస్తున్నాడు. ఈ ఏడాది ఎలాగైనా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాలని రామ్ ఉబలాటపడుతున్నాడు. కాగా ‘శివం, హరికథ’ చిత్రాలను ఆయన పెద్దనాన్న,ఉత్తమాభిరుచి ఉన్న స్రవంతి రవికిషోర్ స్వయంగా నిర్మిస్తుండంతో ఈ చిత్రాలకు కూడా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. మొత్తానికి ఛార్జింగ్ తక్కువైన తన బ్యాటరీని మరలా పూర్తిగా చార్జింగ్ ఎక్కించే పనిలో రామ్ బిజీగా ఉన్నాడు.