Advertisement
Google Ads BL

ప్రేక్షకుల్ని మోసం చేస్తున్న టి.వి. గేమ్‌ షోలు.!


ఒకప్పుడు ప్రధాన వినోద సాధనం సినిమా. మారుతున్న కాలం, పెరుగుతున్న  సాంకేతిక పరిజ్ఞానం ప్రేక్షకుల్ని సినిమా నుండి దూరం చేసింది. ఒకప్పుడు వందరోజులు, సిల్వర్‌ జూబ్లీ, గోల్డెన్‌ జూబ్లీ ఆడిన సినిమాలు వున్నాయి. ఇప్పుడు ఒక సినిమా 50 రోజులు ఆడాలంటే అది చాలా ఎక్స్‌ట్రార్డినరీ సినిమా అయి వుండాలి. సినిమా ఎంత ఎక్స్‌ట్రార్డినరీగా వున్నా ఇంట్లో వున్న టి.వి.ని వదిలి థియేటర్‌కి రావడానికి ఇష్టపడడం లేదు ఫ్యామిలీ ఆడియన్స్‌. ఒక పక్క సీరియల్స్‌, మరో పక్క ఆకర్షించే రకరకాల ప్రోగ్రామ్స్‌ వారిని టి.వి.కి కట్టి పడేస్తున్నాయి. 

Advertisement
CJ Advs

ఇదే సమయంలో ప్రేక్షకుల బలహీనతల్ని క్యాష్‌ చేసుకునేందుకు ఎంతకైనా దిగజారుతున్నాయి కొన్ని ఛానల్స్‌. ప్రజెంట్‌గా దాదాపు అన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌లో గేమ్‌ షోలు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని ఛానల్స్‌ ఒక అడుగు ముందుకు వేసి ప్రేక్షకుల ముందు లక్షల రూపాయలను పెట్టి, ప్రేక్షకులతో కాకుండా సెలబ్రిటీలతో మాత్రమే షో నిర్వహిస్తున్నాయి. డబ్బు ప్రస్తావన లేకుండా ఎంత మంచి గేమ్‌ షో చూపించినా ఆడియన్స్‌కి ఆసక్తి వుండదు. కాబట్టి వేలు కాదు, లక్షలతో గేమ్‌ షోలు నిర్వహిస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు పార్టిసిపేట్‌ చేసిన ఒక గేమ్‌ షోలో ఫైనల్‌ విన్నర్‌కి 10 లక్షలు, మరో షోలో 20 లక్షలు.. ఇలా లెక్కకు మించిన డబ్బు చూపించి ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేస్తున్నారు. ఆ డబ్బు ఆడియన్స్‌కి రాకపోయినా అంత డబ్బుతో ఆట ఆడుతున్నారంటే వారిలో ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ అవుతుంది కాబట్టి ఆ వీక్‌నెస్‌ని క్యాష్‌ చేసుకుంటూ షోలు నిర్వహిస్తున్నారు ఛానల్స్‌ యాజమాన్యాలు. ప్రతిరోజూ ఎన్నో గేమ్‌ షోలు ఛానల్స్‌లో దర్శనమిస్తున్నప్పటికీ సామాన్య ప్రేక్షకులు పాల్గొనే షోలు ఒకటి, రెండు మాత్రమే వున్నాయి. వాటిలో కూడా వారికి ఇచ్చే బహుమతులు వందలు, వేలల్లో వుంటాయి తప్ప లక్షల్లోకి వెళ్ళవు. ప్రతి గేమ్‌ షోనూ సెలబ్రిటీస్‌తోనే చెయ్యడానికి రీజన్‌ ఏమిటంటారు? సెలబ్రిటీలంటే ప్రేక్షకులు చూస్తారు, దానికి తగ్గట్టుగానే ఛానల్‌కి యాడ్‌ రెవిన్యూ కూడా వుంటుంది. 

ఇక్కడ మరో మతలబు కూడా వుందట. ప్రస్తుతం మనం చూస్తున్న కొన్ని గేమ్‌ షోలలో విన్నర్‌ గెలుచుకునే 10 లక్షలుగానీ, 20 లక్షలుగానీ, 30 లక్షలుగానీ అవి ఆ విన్నర్‌కి చేరవు. ఆ షోలో పాల్గొన్నందుకు కొంత రెమ్యునరేషన్‌ మాత్రమే ఆ సెలబ్రిటీకి వెళ్తుంది. వాళ్ళు గెలుచుకున్నట్టు చూపించే లక్షలన్నీ మళ్ళీ ఛానల్‌ ఖాతాలోకే వెళ్తాయట. ఈ విషయాలన్నీ రెగ్యులర్‌గా గేమ్‌ షోలలో పాల్గొనే సెలబ్రిటీలకు తెలిసినవే. అయినప్పటికీ గేమ్‌ షోలో నిజంగానే అన్ని లక్షలు గెలుచుకొని ఇంటికి తీసుకెళ్తున్నట్టు తెగ నటించేస్తారు. వారు తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కి రెట్టింపు ఓవరాక్షన్‌ చేస్తుంటారు. ఈ వ్యాపారం ఛానల్స్‌ వారికి లాభసాటిగానే వున్నట్టుంది. అందుకే కొత్త కొత్త గేమ్‌ షోలు లాంచ్‌ చేస్తున్నారు. ఈ విధంగా టి.వి.కి అంటి పెట్టుకొని వున్న ప్రేక్షకుల్ని థియేటర్స్‌కి మరింత దూరం చేయడమే కాకుండా లక్షల ప్రైజ్‌ మనీ చూపిస్తూ మోసం చేస్తున్నాయి కొన్ని ఛానల్స్‌. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs