Advertisement
Google Ads BL

దీనికి టాలీవుడ్‌ అంతా కలిసి వస్తుందా?


భారత ప్రధాని మోడి తలపెట్టిన స్వచ్ఛ భారత్‌కి సంబంధించి ప్రచారం స్పీడ్‌ అందుకుంది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్‌ అంటూ పిలుపునిచ్చారు. కెసిఆర్‌ పిలుపుకు స్పందించిన ఎ.పి. ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ రేపు అంటే ఆదివారం స్వచ్ఛ హైదరాబాద్‌లో పాలు పంచుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి నటీనటులకు, నిర్మాతలకు, దర్శకులకు, ఇతర టెక్నీషియన్స్‌ అందరికీ లెటర్స్‌ పంపారు. ఆదివారం(17.05.2015) ఉదయం 8 గంటలకు ఫిలింనగర్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌ నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 

Advertisement
CJ Advs

స్వచ్ఛ హైదరాబాద్‌  కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఫిలిం ఛాంబర్‌ ఆలోచన బాగానే వుంది. కానీ, దీనికి ఎంతమంది సపోర్ట్‌గా వస్తారన్నది సందేహమే. ఆమధ్య వైజాగ్‌లో వచ్చిన హుద్‌ హుద్‌లో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ యావత్తూ కలిసి ‘మేము సైతం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినవారు ఎంత మంది హాజరయ్యారో, ఎంతమంది ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్‌ చేశారో మనందరికీ తెలిసిందే. తుపాను సంభవించి వైజాగ్‌కి తీవ్ర నష్టం వాటిల్లితేనే పరిశ్రమ అంతా కలిసి కట్టుగా రాలేదు. 

మరి హైదరాబాద్‌ని శుభ్రం చేద్దాం, హైదరాబాద్‌ను స్వచ్ఛ హైదరాబాద్‌గా తయారు చేద్దాం అంటే ఎంత మంది వస్తారంటారు? షూటింగ్‌లు లేకుండా ఖాళీగా వున్నవారికైనా ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళాల్సి వచ్చినపుడు అర్జెంట్‌ పని పడుతుంది. పైగా ఉదయం 8 గంటలకు ప్రారంభమై 10 గంటలకు ముగిసే ఈ కార్యక్రమం కోసం ఆలోచించేది ఎంతమంది, పాల్గొనేది ఎంతమంది? టాప్‌ హీరోలు ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉత్సాహం చూపించరు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇలాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని మొత్తానికి అయ్యిందనిపించాం అని చెప్పుకోవడానికి కొంతమంది ఉత్సాహవంతులు ఉండనే వుంటారు కాబట్టి రేపు జరగబోయే ‘స్వచ్ఛ హైదరాబాద్‌’ కూడా ఎప్పటిలాగే సూపర్‌ సక్సెస్‌ అవుతుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs