Advertisement
Google Ads BL

మంచి రేటు పలికిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’!


ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ కుమార్తె ప్రియాంకాదత్‌ స్వప్న సినిమా పతాకంపై నిర్మించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రం కొద్ది నెలల కిందట విడుదలైంది. శేఖర్‌కమ్ముల శిష్యుడు నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో నాని, మాళవికానాయర్‌లు జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మంచి టాక్‌ వచ్చినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం బిలో యావరేజ్‌ చిత్రంగా నిలిచింది. ఇప్పుడీ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ అమ్ముడయ్యాయి. జెమిని టీవీ చానెల్‌ 3.90కోట్లకు ఈ హక్కులను చేజిక్కించుకుంది. దీంతో చూసుకుంటే లోబడ్జెట్‌తో తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నిర్మాతకు సేఫ్‌ ప్రాజెక్ట్‌గానే మిగిలిందని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs