మహేష్‌బాబు నా చిత్రంలో గెస్ట్‌రోల్ చేయడంలేదు అంటున్నాడు సుధీర్‌బాబు. ఆయన నటించిన తాజా చిత్రంలో మహేష్ కూడా కొన్ని సెకన్లపాటు వెండితెరపై కనిపిస్తాడనే వార్తలు కొంతకాలంగా వస్తున్నాయి.. ఈ సందర్బంగా సుధీర్‌బాబు ఈ వివరణ ఇచ్చాడు. సుధీర్‌బాబు మాట్లాడుతూ.... మహేష్ మా చిత్రంలో గెస్ట్‌గా చేస్తున్నాడనే వార్తలు చాలారోజులుగా వింటున్నాం. నిజానికి మొదట మేము అలాగే భావించాం. కానీ కేవలం 15సెకన్ల గెస్ట్ రోల్ కోసం మహేష్‌లాంటి పెద్దస్టార్‌ని తీసుకురావడం పద్దతి కాదని భావించి మేము దానికి డ్రాప్ అయ్యాం. అయితే నా చిత్రంలో నాగచైతన్య, రానాలు గెస్ట్‌లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా మంచు మనోజ్ కూడా గెస్ట్‌గా చేయడానికి ఒప్పుకున్నాడు. స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తి మనోజ్. నేను కాల్ చేసిన వెంటనే మనోజ్ అతిథిపాత్రలో చేయడానికి ఒప్పుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం... అంటున్నాడు సుధీర్‌బాబు.