సమంతకు ఓ అలవాటు ఉంది. ఏదైనా ఫంక్షన్‌కు ఆమె హాజరయిందంటే చాలా చాలా ప్రత్యేకంగా తయారై వస్తుంది. అందుకోసం డిజైనర్ చేత ప్రత్యేకంగా చేయించుకున్న డిజైనర్ దుస్తుల్లో వస్తుంది. ఆటోమేటిగ్గా వేడుకకు హాజరైన అందరిని, మీడియా అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంటుంది. ఇప్పుడు అదే స్టైల్‌ను రకుల్‌ప్రీత్‌సింగ్ ఫాలో అవుతోంది. ఇటీవల జరిగిన ‘పండగచేస్కో’ ఆడియో వేడుకకు 70వేల రూపాయలతో తయారుచేయించిన గౌన్‌తో వచ్చింది. ‘కిక్2’కు ప్రఖ్యాత డిజైనర్ రీతూకుమార్ డిజైన్ చేసిన మంచి శారీకట్టుకుని అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. మొత్తానికి ఈ విషయంలో కూడా సమంత టాప్ ప్లేస్‌ను రకుల్ సొంతం చేసుకున్నట్లే కనిపిస్తోంది.