సినిమా సినిమాకి వైవిధ్యం చూపించాలని తపన పడే యంగ్‌హీరోల్లో శర్వానంద్ ఒక్కడు. ‘రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు’ వంటి వరుస హిట్స్ తర్వాత ఆయన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రానికి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా కొత్త హీరోయిన్‌ను పరిచయం చేయనున్నారు. యంగ్‌మోడల్ అయిన హిమని సిసోడియాని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రం మే నెలాఖరులో సెట్స్‌పైకి వెళ్లనుంది.