Advertisement
Google Ads BL

మనోజ్‌నందంకు మాతృవియోగం!!


‘ఛత్రపతి, అతడు’ వంటి చిత్రాల ద్వారా బాల నటుడిగా.. ‘ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ, ఒక క్రిమినల్‌ ప్రేమకథ’ చిత్రాల ద్వారా కథానాయకుడిగా పరిచితుడైన మనోజ్‌నందం మాతృమూర్తి ఉషారాణి ఈరోజు (మే 9, 2015) మరణించారు. ఆమె వయసు 51. 

Advertisement
CJ Advs

గత కొంతకాలంగా ఆమె లంగ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 

 ‘తన తల్లి క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ నిమిత్తం పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనందున తాను తన దగ్గరకు వచ్చిన ప్రతి సినిమాను అంగీకరిస్తూ వచ్చానని.. ఇప్పుడు తన తల్లి పూర్తిగా కోలుకొని.. చక్కగా ఆరోగ్యంగా ఉన్నారని.. ఇకపై తాను అంగీకరించే సినిమాల విషయంలో తగిన శ్రద్ద తీసుకొంటాన’ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మనోజ్‌నందం చెప్పారు. ఇంతలోనే ఈ విషాదం  చోటు చేసుకోవడం ఎంతైనా బాధాకరం. ఉషారాణి హైద్రాబాద్‌లోని మణికొండలో ‘ఉషా ప్లే స్కూల్‌’ పేరుతో ఓ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు. మనోజ్‌నందం రెండోవాడు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, మనోజ్‌నందంకు ఆ దేవుడు మనోస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకొందాం!!

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs