రీసెంట్ గా జరిగిన 'లెజెండ్' 400 వందల రోజుల వేడుకలు బాలయ్య తాజా సినిమాకి మంచి ప్రచారాన్ని అందిస్తాయని, అలరిస్తాయని అందరూ అనుకున్నారు. కానీ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవ్వడం చూస్తుంటే 'లెజెండ్' వల్ల 'లయన్' కి ఒరిగిందేమీ లేదని చెప్పక తప్పదు. హిందూపురం యమ్ యల్ ఎ, ఆంద్రప్రదేశ్ అంతా పసుపు రంగు రాజ్యమేలుతుంది, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ అనంతరం వస్తున్న సినిమా అయినా 'లయన్'కి కష్టాలు తప్పటం లేదంటే ఇది దేనికి సూచకం. దర్శకుడిలో అనుభవలేమి ఉన్నా...100 వ సినిమాకి అతి చేరువలో ఉన్న బాలయ్య చేశాడనే ధైర్యం కూడా బిజినెస్ చేయలేక పోతుందా? ఏమిటో వింతకాల వైపరీత్యం; మరోవైపు మాత్రం ఇది నందమూరినామ సంవత్సరమనే డంకా..! హతవిధి!