Advertisement
Google Ads BL

సరైన నిర్ణయం తీసుకున్న రజనీ!


‘కొచ్చాడయాన్‌, లింగ’ చిత్రాల ఘోరపరాజయం తర్వాత రజనీ నటించే చిత్రం ఏమిటి? అనే విషయంపై ఉత్కంఠ నెలకొని ఉంది. శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ ‘నెంబర్‌వన్‌’ టైటిల్‌తో ఓ భారీ బడ్జెట్‌ చిత్రం చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అదే సమయంలో రజనీ యువతరం దర్శకుడు రంజిత్‌ దర్శకత్వంలో  ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ రెండు వార్తల్లోనూ నిజం ఉందని, కొంతకాలంగా స్థబ్దుగా ఉన్న రజనీ తన అభిమానులను ఎలాగైనా ఊరడించాలనే  ఉద్దేశ్యంతో ఒకేసారి ఈ రెండు చిత్రాల్లోనూ నటించనున్నాడని, అయితే శంకర్‌ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో చేయనున్న రజనీ రంజిత్‌ సినిమాను మాత్రం వీలైనంత తక్కువ బడ్జెట్‌లో చేయడానికి అంగీకరించాడని, ఈ చిత్రాన్ని కలైపులి థాను నిర్మించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs