Advertisement
Google Ads BL

బన్నీకి షాక్‌ ఇచ్చిన మలయాళీ ప్రేక్షకులు!


అల్లుఅర్జున్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో తాజాగా వచ్చిన చిత్రం ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం మలయాళ వెర్షన్‌ కిందటి నెల 24న విడుదలై కేరళలో అల్లుఅర్జున్‌ కెరీర్‌లోనే అతిపెద్ద ఫ్లాప్‌గా ఈ చిత్రం నమోదైంది. రెండో రోజు నుండే అక్కడ కలెక్షన్స్‌ డ్రాప్‌ కావడం అక్కడ సినిమాను విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లకు చెమటలు పట్టిస్తోంది. కేరళలో ఈ చిత్రం 71 థియేటర్లలో విడుదలైంది. కేరళ మార్కెట్‌కు అది పెద్ద సంఖ్య కిందనే లెక్క. తొలిరోజే చాలా నిరాశజనకంగా ప్రారంభమైన ఈ చిత్రం కేవలం 61లక్షల షేర్‌ను మాత్రమే అక్కడ మొదటిరోజు వసూలు చేసి అందరినీ నివ్వెరపరిచింది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs