ఆస్కార్ రవిచంద్రన్... తమిళ, తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన పేరు. కమల్ దశావతారం, విక్రమ్, శంకర్ కలయికలో అపరిచితుడు, ఐ, సూర్య సన్నాఫ్ కృష్ణన్ తదితర భారీ చిత్రాలను నిర్మించన ఘనత ఆయన సొంతం. అయితే, భారీ నిర్మాణ వ్యయంతో నిర్మించిన 'ఐ' చివరకు నష్టాలను మిగిల్చింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుండి రవిచంద్రన్ పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చని కారణంగా నేడు నిర్మాత ఆస్తులను సీజ్ చేశారు.
రవిచంద్రన్ ఇల్లు, చెన్నై అశోక్ నగర్లో గల ఆఫీసుతో సహా మూడు థియేటర్లను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు జప్తు చేసింది. రవిచంద్రన్ రూ.84 కోట్లు అప్పు తీసుకున్నారు. వడ్డీతో కలిపి ఇప్పుడు రూ.96.75 కోట్లు అయ్యిందని ఓ ప్రకటనలో బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. ఏప్రిల్ 28న ఆస్తుల జప్తు గురించి ప్రకటన ఇచ్చారు. తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలను ఈ పరిణామం నివ్వెరపరిచింది. పెద్ద షాక్ తగిలింది. కమల్ విశ్వరూపం 2 చిత్రానికి ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాత. భూలోగం అనే మరో చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు.
Advertisement
CJ Advs