‘గంగ’ చిత్రంలో కీలకపాత్ర పోషించిన నిత్యామీనన్ ప్రచార చిత్రాల్లో మాత్రం అసలు కనిపించడంలేదు. పాపులారిటీ పరంగా చూసుకున్నా కూడా తాప్సి కంటే నిత్యామీననే బెటర్. అయినా లారెన్స్ తన చిత్రం ప్రమోషన్ కోసం నిత్యాను వాడుకోవడం లేదు. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే నిత్యకు లారెన్స్‌కు అసలు పడేది కాదని, సెట్స్‌లో కూడా ఇద్దరు ఎడమొహం.. పెడమొహంలాగా ఉండేవారని సమాచారం. లారెన్స్ టేకుల మీద టేకులు తీయడం, చాలా సన్నివేశాలను రీషూట్ చేయడం వల్ల నిత్య చాలా ఇబ్బంది పడిందట . అంతేకాదు... ఒకసారైతే ఆమె ఏకంగా షూటింగ్ నుంచి చెప్పపెట్టకుండా వెళ్లిపోవడంతో లారెన్స్ బతిమిలాడి ఆమెను తీసుకొని వచ్చి షూటింగ్ పూర్తి చేశాడని, ఇప్పుడు సినిమా ఎలాగూ హిట్‌టాక్ సొంతం చేసుకోవడంతో అన్నీతానై నిత్యను పట్టించుకోవడం లేదనేది కోలీవుడ్ టాక్.