Advertisement
Google Ads BL

ఫ్యాన్స్‌కు బాలయ్య డబుల్‌ ధమాకా!


అభిమానుల కళ్లలో ఆనందం చూసేందుకు దేనికైనా సిద్దపడే హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ. ఆయన నటించిన ‘లెజెండ్‌’ చిత్రం మే 2 వ తేదీన విడుదలై 400 రోజులు ప్రదర్శింపబడి రికార్డ్‌ క్రియేట్‌ చేస్తోంది. ఎమ్మిగనూర్‌లో ఈ వేడుకను ఘనంగా జరిపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇక బాలయ్య హీరోగా నటిస్తున్న ‘ఎన్‌బికె లయన్‌’ చిత్రం మే 8వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్స్‌, ఆడియోలకు  బాగా రెస్పాన్స్‌ వస్తుండటంతో తమ హీరో ఈ సారి కూడా ‘లెజెండ్‌’ను మించిన హిట్‌ను సాదించడం ఖాయమనే  భావనలో నందమూరి అభిమానులు సంబరాలు జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. మొత్తానికి మే నెలంతా నందమూరి అభిమానులదే కావాలని, ‘లయన్‌’ భారీ హిట్టు అయితే ఈ సమ్మర్‌ మొత్తం బాలయ్యదే అవుతుందనే ఆశ నందమూరి అభిమానుల్లో కనిపిస్తోంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs