Advertisement
Google Ads BL

మెగాస్టార్‌ హీరోయిన్‌ రీఎంట్రీ!


మీనాక్షి శేషాద్రి... బాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించిన అందాల ముద్దుగుమ్మ. ఈమె కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ‘ఆపద్బాంధవుడు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో ఆమె అచ్చతెలుగు అమ్మాయిలా అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా పీక్స్ల్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయింది. దాదాపు 17ఏళ్ల తర్వాత ఆమె మరలా ఇప్పుడు ఓ బాలీవుడ్‌ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తోంది. ఓ బాలీవుడ్‌ చిత్రానికి ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నిన్నటితరం హీరో సన్నిడియోల్‌ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘ఘాయల్‌ వన్స్‌ మోర్‌’ చిత్రంలో ఆమె నటిస్తోంది. ‘ఘాయల్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందనుంది. కాగా ఈ చిత్రం మొదటి భాగం ‘ఘాయల్‌’లో కూడా మీనాక్షినే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs