మే 1వ తేదీన బాలకృష్ణ నటిస్తున్న ‘లయన్’ చిత్రం విడుదల అవుతుందని భావించిన కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఆ తేదీ నుండి బయటకు వచ్చేద్దామని నిర్ణయించుకున్నారు. అయితే అనుకోకుండా ‘లయన్’ లేటవ్వడంతో ఆ స్ధానం ఖాళీ అయింది. ఇదే అదనుగా భావించిన కొన్ని చిన్న చిత్రాలు ఆ సమయంలో థియేటర్లలోకి రావడానికి రెడీ అయ్యాయి. అయితే మొదట నుండి మే 1వ తేదీనే వద్దామని భావించిన క్రిష్-రామోజీరావు-రాజేంద్రప్రసాద్‌ల ‘దాగుడు మూతల దండాకోర్’ విడుదల వాయిదా పడింది. ఇక మే 1న రావాలని కమల్‌హాసస్ ‘ఉత్తమవిలన్’, లారెన్స్ ‘గంగ’లు డిసైడ్ అయ్యాయి. దీంతో ఈ పోటీ కూడా తక్కువేమీ కాదని భావించిన ‘దొంగాట, దాగుడు మూతల దండాకోర్’ చిత్రాలు విడుదల వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ‘గంగ’ను నైజాంలో రిలీజ్ చేయనున్న దిల్‌రాజునే ‘దాగుడు మూతల దండాకోర్’ చిత్రాన్ని రెండు తెలుగురాష్ట్రాలలోనూ విడుదల చేస్తుండటంతో ఒకే రోజు తన రెండు చిత్రాలు పోటీ పడటం ఇష్టం లేక ‘దాగుడుమూతల దండాకోర్’ను వాయిదా వేసినట్లు సమాచారం.