గోపీచంద్, రాశిఖన్నా జంటగా యువి క్రియేషన్స్ బేనర్‌లో రాధాకృష్ణ అనే నూతన దర్శకుని చేతిలో తెరకెక్కిన చిత్రం ‘జిల్’. ఈ చిత్రానికి రివ్యూలు బాగానే వచ్చినా కలెక్షన్స్ మాత్రం సరిగ్గా రాలేదు. రిలీజైన కొత్తల్లో మార్కెట్‌లో మరో సినిమా లేకపోవడంతో ఈ సినిమాకు బాగా కలిసోచ్చింది. అదే ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఈ చిత్రం ఆ అవకాశాన్ని సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయింది. మొత్తానికి ‘జిల్’ చిత్రం ఓ లాస్ వెంచర్‌గా మిగిలిపోయిందని ట్రేడ్ వర్గాలు తేల్చాయి. గోపీచంద్ గత చిత్రం ‘లౌక్యం’ఎఫెక్ట్ ‘జిల్’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. అందులోనూ యువి క్రియేషన్స్ బేనర్ వాల్యూ కూడా కలిసి వచ్చింది. ప్రీరిలీజ్ థియేటర్ బిజినెస్ 16కోట్లు అని సమాచారం. అయితే చిత్రం మాత్రం కేవలం 12.5 కోట్లు మాత్రమే రెవిన్యూ సాధించింది. దాంతో డిస్ట్రిబ్యూటర్లకు బాగా నష్టం వచ్చిందని సమాచారం.