ప్రముఖ సౌతిండియా నటి, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. వచ్చే ఏడాది ఆమె వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆమె ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించింది. ఆమెది లవ్ అండ్ అరేంజ్‌డ్ మ్యారేజ్ కావడం గమనార్హం. అయితే ఆమె చేసుకోబోయేది ఎవరు? అనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. సమయం వచ్చినప్పుడు తానే తన ఫియాన్సీని తీసుకొని మీడియా ముందుకు వస్తానని ప్రియమణి చెప్పుకొచ్చింది. గత కొంతకాలంగా అతనితో కలిసి సహజీవనం చేస్తున్నానని, అతను సినిమా పరిశ్రమకు చెందిన వాడు మాత్రం కాదని ఆమె స్పష్టం చేసింది.