సినీ నటుల్లో నయనతారది భిన్నమైన మనస్తత్వం. డబ్బులిచ్చారా.. తీసుకున్నానా.. అంతవరకే ఆమె ఆలోచిస్తారు. సినిమా రీలీజ్ ప్రెస్‌మీట్‌లు, ప్రమోషన్లకు రమ్మన్నా.. అసలు రారు. ఇదే విషయమై 'అనామిక' విడుదల సమయంలో దర్శకుడు శేఖర్‌కమ్ములతో కూడా నయనతారకు గొడవైంది. ఇక షూటింగ్‌స్పాట్‌లో కూడా ఆమె తన షాట్ షూటింగ్ వరకు మాత్రమే కనిపించి, ఆ తర్వాత తనకు సంబంధం లేదన్నట్లు అక్కడినుంచి వెళ్లిపోతారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. శింబు, ప్రభులతో తన ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడమే ఇందుకు కారణం కావచ్చని అందరూ భావించారు. అయితే ఇప్పుడు నయన తీరులో మార్పుకనిపిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ స్పాట్‌లో అందరితో కలివిడిగా మాట్లాడుతూ.. పలకరిస్తోందని, తన షాట్ అయిపోయినా అక్కడే ఉండి తోటినటీనటులు, సాంకేతిక సిబ్బందితో ముచ్చట్లు పెడుతోంది. అంతేకాకుండా సినిమా ప్రమోషన్లలో కూడా ఆసక్తిగా పాల్గొంటోంది. మరి ఇంత సడెన్‌గా నయనలో ఇంతమార్పు ఎందుకు వచ్చిందనేది ఇండస్ట్రీకి అర్థంకాకుండా ఉంది. ఏదిఏమైనా నయనలో వచ్చిన ఈ మార్పు మంచిదేనని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.