Advertisement
Google Ads BL

సూపర్బ్‌గా ఉన్న ‘మాస్‌’ ట్రైలర్‌!


తమిళ స్టార్‌ సూర్య హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాస్‌’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్‌ టీజర్‌ ఇటీవలే విడుదలైంది. టీజర్‌ సూపర్బ్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. మే 15న ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇదో డిఫరెంట్‌ జోనర్‌ సినిమా. సూర్య సరసన నయనతార, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువన్‌శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార నటిస్తుండటం మరో హైలెట్‌. గతంలో ‘గజిని, ఘటికుడు’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట ఇందులో ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తుండటం విశేషం.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs