చెన్నై చుల్‌బులి సమంత ఓ చిన్న సినిమాలో నటించేందుకు ఒప్పుకొందని కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించనున్న ఆ చిత్రాన్ని వీవీ వినాయక్ తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించడానికి ప్లాన్ చేశాడనీ... ఆ చిత్రాన్ని వినాయక్ ఫ్రెండ్ అయిన ఛోటా కె.నాయుడు నిర్మిస్తాడని చెప్పుకొన్నారు. సమంత కూడా `నాకు చిన్న సినిమాలంటే చాలా చాలా ఇష్టం` అని చెబుతుంటుంది కాబట్టి ఆ వార్త నిజమేనేమో అనుకొన్నారంతా. అయితే అదంతా తుస్సేనట. ఆ విషయంపై సందీప్‌కిషన్ క్లారిటీ ఇచ్చాడు. సమంత, నేను కలిసి నటిస్తున్న వార్త ఒట్టి రూమరే అనీ... సమంత అన్నా, వినాయక్‌గారన్నా ఎంతో గౌరవమని, వాళ్లతో సినిమా చేస్తే అవకాశం వస్తే సంతోషమే కానీ... అలాంటి ప్రాజెక్ట్ ఏదీ ఖరారు కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు సందీప్ కిషన్ `టైగర్` చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. సమంత తమిళంలో విక్రమ్, విజయ్‌మిల్టన్‌ల చిత్రంలో నటిస్తోంది.
Advertisement
CJ Advs