మాస్ అంటే బస్సు పాస్ కాదు.. ఎవరు పడితే వారు పెట్టేసుకోవడానికి.... అంటూ రవితేజ చెప్పినా కొంత మంది మారడం లేదు. మాస్ ఇమేజ్ అర్జంట్‌గా తెచ్చేసుకోవడం కోసం నానాపాట్లు పడుతున్నారు. నాగశౌర్య అయితే అచ్చంగా రవితేజను కాపీ కొట్టేయడానికి చూస్తున్నాడు. రెండు సినిమాల్లో లవర్‌బోయ్‌గా కనిపించాడు. కుర్రాడు లేతగా ఉన్నాడు... లవ్‌స్టోరీలకు పనికొస్తాడని అనుకుంటే ఇప్పుడు ఇంతకు మించి పనేం లేదన్నట్లు మాస్ ఇమేజ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ‘జాదూగాడు’ అనే సినిమాలో వీర మాస్ లెవల్లో వస్తున్నాడు. ట్రైలర్స్ విడుదలయ్యాయి. అందులో నాగశౌర్య బాడీ లాంగ్వేజ్, పేల్చిన డైలాగులు చూస్తుంటే రవితేజని ఇమిటేట్ చేసినట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆల్‌రెడీ ఓ రవితేజ ఉన్నాడు కదా..! ఇప్పుడు ఇంకొకడు ఎందుకో మరి.. అంటున్నారు. మరి ప్రేక్షకులు ‘జాదూగాడు’ని, అందులోను డూప్లికేట్ రవితేజను ఎంత ఆదరిస్తారో వేచిచూడాల్సివుంది....!