మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్‌సల్మాన్‌కు ‘ఓకే కన్మణి’ చిత్రంతో పాటు ‘బెంగుళూరుడేస్’ వల్ల మలయాళ, తమిళ భాషలతో పాటు తాజాగా ‘ఓకే బంగారం’తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. అంటే అతి తక్కువ కాలంలోనే మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోతో సినిమా తీస్తే మొత్తం దక్షిణాదిలోని అన్ని భాషల్లో డిమాండ్ ఉంటుంది. ఇదే విషయాన్ని గ్రహించిన మన నిర్మాత దిల్‌రాజు చిన్నగా దుల్కర్‌సల్మాన్‌ను లైన్‌లో పెట్టి ఓ సినిమాకు సైన్ చేయించుకునే పనిలో ఉన్నాడని ఫిల్మ్‌నగర్ సమాచారం. కాగా సాధారణంగా మణిరత్నం తన చిత్రాలను తమిళ, మలయాళ, తెలుగు భాషలతో పాటు హిందీలో కూడా తీస్తాడు. కానీ ‘ఓకే కన్మణి’ చిత్రాన్ని మాత్రం ఎందుకనో హిందీలో తీయలేదు. కాగా ఈ చిత్రం కథ బాలీవుడ్‌కు బాగా యాప్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఓకే కన్మణి’ చిత్రం రీమేక్ హక్కులను తీసుకోవాలని బాలీవుడ్ సంస్థ సిద్దంగా ఉందని, మరి ఈ చిత్రంలో ఎవరు నటిస్తారు? దర్శకత్వం మణిరత్నం చేస్తాడా? లేక వేరేవారిని పెట్టుకుంటారా? అనే చర్చ సాగుతోంది.