ఇంతకాలం తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన సమంత ప్రస్తుతం తమిళ ప్రేక్షకుల మదిలో నిలిచిపోవాలని కోరుకుంటోంది. ఆమె తాజాగా చియాన్ విక్రమ్ హీరోగా విజయ్‌మిల్టన్ దర్శకత్వంలో ‘10ఎంద్రాకుల్ల’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంత చేసిన డేర్‌డెవిల్ స్టంట్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. తన ఐదేళ్ల కెరీర్‌లో ఆమె ఈ చిత్రంలో తొలిసారిగా డ్యూయల్‌రోల్ పోషిస్తోంది. ఓ పాత్రలో ఆమె నేపాలీ యువతిగా కనిపించనుందని సమాచారం. చార్మి కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని వేసవి సీజన్ చివర్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రంతో సమంత ఎంత మంచి నటి అనేది తేలిపోనుందని, క్లిష్టమైన ఈ పాత్రకు ఆమె ఏమాత్రం న్యాయం చేయగలదు? అనే అంశంపై కోలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.