నేపథ్యగాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇంతకాలం తన గాన మాధుర్యంతో ఆకట్టుకున్న సింగర్ సునీతకు ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పనక్కరలేదు. అయితే రీసెంట్ సునీత, మహేష్ బాబు నటించబోయే 'బ్రహ్మోత్సవం' సినిమాలో మహేష్ కు వదిన పాత్రలో నటించడానికి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఆమెను ఒప్పించారని వార్తలు వచ్చాయి. ఇంతకముందు సునీత, శేకర్ కమ్ముల 'అనామిక' సినిమాలో ప్రమోషనల్ సాంగ్ లో నటించింది. మరలా 'బ్రహ్మోత్సవం' సినిమాలో సునీత కనిపించబోతోందని ఆమె అభిమానులు చాలా సంతోషించారు.
కాని ఈ విషయాలను సునీత ఖండించింది. ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ "అసలు ఈ సినిమాలో నటించమనే ఆలోచన ఎవరిదో తెలియదు కాని నన్నయితే ఎవరు సంప్రదించలేదు. సింగింగ్, డబ్బింగ్ చెప్పడం నాకిష్టం కాని యాక్టింగ్ అంటే చాలా కష్టం. నటించను అని చెప్పను కానీ సంగీతానికి ప్రాధాన్యత ఉన్న సినిమాలలో అయితే నటిస్తాను" అని చెప్పుకొచ్చింది. దీంతో మహేష్ సినిమాలో సునీత నటించడం లేదని క్లియర్ గా తెలిసిపోతుంది.