Advertisement
Google Ads BL

శ్రీశాంత్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?


క్రికెట్ లో నిషేదానికి గురై తనపై పడ్డ మచ్చను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు క్రికెటర్ శ్రీశాంత్. అందులో భాగంగానే సినిమాలలో నటించడం మొదలు పెట్టాడు. పలు టివి షోలలో నటించిన శ్రీశాంత్ ఓ మలయాళం సినిమాలో గెస్ట్ రోల్ లో నటించాడు. రీసెంట్ గా ఆయన ఓ తెలుగు సినిమాకు సైన్ చేసిన విషయం తెలిసిందే. అయితే 'స్నేహగీతం' , 'ఇట్స్ మై లవ్ స్టొరీ' వంటి భిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు మధురశ్రీధర్ రెడ్డి.

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఆయన షిరిడి సాయి కంబైన్స్ పతాకంపై ఎం.వి.కె రెడ్డితో కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగానే శ్రీశాంత్ ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఆగస్టులో మొదలుపెట్టనున్నారని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ సంవత్సరంలోపు ముగించుకొని వచ్చే సంవత్సరం ప్రారంభంలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరి శ్రీశాంత్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి..! 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs