'అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి మొదట్లో ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకున్నా 'గబ్బర్ సింగ్' , 'ఎవడు' , 'రేసుగుర్రం' వంటి హిట్ సినిమాలలో నటించి స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది హీరోయిన్ శ్రుతిహాసన్. గబ్బర్ సింగ్ సినిమా తరువాత ఆమె ఇమేజ్ ఓ రేంజ్ లో పెరిగింది. తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలో కూడా నటిస్తూ టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతుంది. అయితే ప్రస్తుతం శ్రుతికి హిందీలో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
ప్రముఖ స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది ఈ అమ్మడు. మురుగదాస్ తదుపరి చిత్రం హృతిక్ తో ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించమని శ్రుతిని సంప్రదించగా వెంటనే ఓకే చేసేసిందట. హృతిక్ పక్కన చాన్స్ అంటే మాటలా.. అందుకే వెంటనే ఓకే చేసింది. ప్రస్తుతం శ్రుతి మహేష్ 'శ్రీమంతుడు', విజయ్ తో 'పులి' చిత్రాలలో నటిస్తుంది.