విలక్షణతకు మారు పేరైన కమల్‌హాసన్ ఇటీవల ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పూర్వం బ్రాహ్మణులు కూడా ఆవు మాంసం తినేవారు.. అని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఆవు మాంసం తినడాన్ని నిషేదించడంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు కమల్. ఇంకా ఆయన మాట్లాడుతూ.... కేవలం ఒక్క ఆవునే కాదు... ఏ జంతువునైనా చంపి తినకూడదు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు మత్స్యఅవతారం ఎత్తాడని, అందుకే ఆఖరికి చేపలను కూడా తినకూడదని, ఆవులాగే చేపలు కూడా పవిత్రమైనవే అన్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులు ఆవు మాంసాన్ని తింటున్నారు. పురాతన గ్రంధాల్లో కూడా బ్రాహ్మణులు ఆవు మాంసాన్ని భుజించే వారు అన్నాడు. మరి ఈ వ్యాఖ్యలు మరెన్ని సంచలనాలకు కారణభూతం అవుతాయో అని కమల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.