‘పడరుత్త పడాద వాలిబర్ సంఘం’ (తెలుగులో ‘కరెంటు తీగ) తర్వాత పోన్‌రామ్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటిస్తున్న రెండో చిత్రం ‘రజనీమురుగన్’. ఇందులో అలనాటి నటి మేనక కుమార్తె కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. రాజ్‌కిరణ్, సూరి, సముద్రకని తదితరులు నటిస్తున్నారు. శ్రియ, సమంత, లక్ష్మీమీనన్‌లు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో శివకార్తికేయన్ రియల్‌ఎస్టేట్ బ్రోకర్‌గా, రజనీకాంత్ అభిమానిగా నటిస్తున్నాడు. సాధారణంగా రజనీకాంత్ స్టైల్‌ని అనుకరించే శివకార్తికేయన్ ఇందులో ఏకంగా రజనీకాంత్‌లాగానే ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. డి. ఇమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. జీ తమిళ చానెల్ ఇప్పటికే ఈ చిత్రం శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Advertisement
CJ Advs