భయానికి, సస్పెన్స్ థ్రిల్లర్లకు కామెడీ కలిపితే ఇక సినిమా సూపర్‌హిట్టే అని ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ భావిస్తున్నారు. అందుకే ఇదే ఫార్ములాను బేస్ చేసుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలా వచ్చిన ‘స్వామిరారా... గీతాంజలి, ప్రేమకథాచిత్రమ్, కార్తికేయ’ వంటి చిత్రాలు ఘనవిజయం సాదించడంతో ఇదే కోవలో మరికొన్ని చిత్రాలు రూపొందుతున్నాయి. అలాంటి వాటిల్లో నాగచైతన్య ‘దోచెయ్’, లారెన్స్ ‘గంగ’, మంచులక్ష్మీప్రసన్న ‘దొంగాట’, ‘బుడుగు’ వంటి చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. మరి వీటిల్లో ఓ రెండు చిత్రాలు విజయం సాదించినా కూడా ఇలాంటి చిత్రాలే మరిన్ని వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ట్రెండ్ ఎంతకాలం నడుస్తుందో వేచిచూడాల్సివుంది......!