సినిమాల్లోకి ప్రవేశించక ముందు మ్యూజిక్ ఆల్బమ్స్, షార్ట్ ఫిల్మ్స్ తదితర వీడియోలలో నటించడం ఆర్టిస్టులకు అలవాటే. ఒక్కసారి హీరోగా, హీరోయిన్‌గా ఇమేజ్, ఫేం వచ్చిన తర్వాత షార్ట్ ఫిల్మ్స్ వైపు చూడరు. క్రేజీ హీరోయిన్ షార్ట్ ఫిల్మ్ లో నటించడం అరుదుగా జరుగుతుంది. హిందీలో ఆలియా భట్, తాజాగా దీపిక పదుకునేలు షార్ట్ ఫిల్మ్ వీడియోలలో నటించారు. తెలుగులో అదా శర్మ ఆ ట్రెండ్ కు శ్రీకారం చుడుతుంది.
ఇటివలే ఓ ఉమెన్ సెంట్రిక్ షార్ట్ ఫిల్మ్ లో నటించాను. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నా పాత్ర వివరాలను చెప్పడం ఇష్టం లేదు. తెరపై చూసి ఆనందించండని అదా శర్మ చెప్తుంది. గత వారం విడుదలైన అల్లు అర్జున్ 'సన్నాఫ్ సత్యమూర్తి'లో అదా శర్మ ఓ చిన్న పాత్రలో సందడి చేసింది. ప్రస్తుతం ఆది సరసన 'గరమ్'లో నటిస్తుంది. మరో రెండు తెలుగు సినిమాలకు సంతకం పెట్టిందట. 'హార్ట్ ఎటాక్' సినిమాలో పూరి జగన్నాధ్ పరిచయం చేసిన ఈ చెన్నై సుందరికి కాస్త నెమ్మదిగా అవకాశాలు లభిస్తున్నాయి.
Advertisement
CJ Advs