బాలీవుడ్ కి సన్నీ సినిమాలు చాలు!


బాలీవుడ్‌లో సినిమా కలెక్షన్లు కొల్లగొట్టాలంటే కథ, నటీనటులు, ఉత్తమ విలువలు వంటి కాకరకాయ కబుర్లు అనవసరం అని తేల్చేస్తున్నారు అక్కడి విశ్లేషకులు. కేవలం అడల్ట్‌ కంటెంట్‌ను కావాల్సినంత జోడించి, ఏ సన్నిలియోన్‌ వంటి హీరోయిన్‌ చేత కావాల్సినంత ఎక్స్‌పోజింగ్‌, హాట్‌సీన్స్‌ ఉంటే చాలు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం ఖాయమేనంటున్నారు. ఇందుకు ట్రేడ్‌వర్గాలు కూడా ఊ కొడుతున్నాయి. దీనికి ఉదాహరణగా ఇటీవల విడుదలైన సన్నిలియోన్‌ చిత్రం ‘ఏక్‌ పహేలి లీలా’ చిత్రాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. సినిమా మొత్తం సన్నిలియోన్‌ హాట్‌సీన్స్‌తో నింపేసిన ఈ చిత్రం బడ్జెట్‌ 15 కోట్లు కాగా, ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే 18కోట్లు వసూలు చేసి అందరికీ లాభాలను తెచ్చిపెట్టింది. మొత్తంగా ఈ చిత్రం 50కోట్లు వసూలు చేయడం ఖాయం అంటున్నారు. బాబీ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇప్పటికే సీక్వెల్‌ నిర్మించే పనిలో నిర్మాతలు బిజీగా ఉన్నారు.

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES