తమిళస్టార్ హీరో అజిత్ త్వరలో ‘శౌర్యం, శంఖం’ వంటి చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అజిత్ సరసన శృతిహాసన్ నటించనుంది. కాగా ఈ చిత్రం ప్రధానంగా అన్నాచెల్లెల మధ్య జరిగే సెంటిమెంట్‌తో సాగుతుందని, కీలకమైన అజిత్ చెల్లిపాత్రకు నిత్యామీనన్‌ను అడుగుతున్నారట. నిత్యామీనన్ అయితే తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో కూడా పాపులర్ నటి కావడం సినిమాకు ప్లస్ అవుతుందని యూనిట్ అభిప్రాయం. ఆమె తిరస్కరిస్తే ప్రత్యామ్నాయంగా శ్రీదివ్యను కూడా సంప్రదిస్తున్నారని, మరి నిత్య చెల్లి పాత్రకు సై అంటుందో లేదో చూడాలి.. అంటోంది కోలీవుడ్ మీడియా...!
Advertisement
CJ Advs