Advertisement
Google Ads BL

కోలీవుడ్‌లో శృతిహాసన్‌కు మరో మంచి అవకాశం!


శృతిహాసన్‌ కోలీవుడ్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఆమెకు తమిళ స్టార్‌హీరో అజిత్‌ సరసన నటించే అవకాశం వచ్చింది. ‘ఎన్నై అరిందాల్‌’ వంటి సూపర్‌హిట్‌ తర్వాత అజిత్‌ దర్శకుడు శివ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విలన్‌గా ‘జిల్‌’ ఫేమ్‌ కబీర్‌ నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ ఈ నెల 25న ప్రారంభం కానుంది. శివ-అజిత్‌ల కాంబినేషన్‌లో కిందటి ఏడాది వచ్చిన ‘వీరం’ చిత్రం ఘనవిజయం సాధించడమే కాదు... హీరోయిన్‌ తమన్నాకి మంచి పేరు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ తాజా చిత్రం శృతిహాసన్‌కు ఎంతటి పేరును తీసుకొస్తుందో చూడాల్సివుంది....!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs