ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించనున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం మే 1న లండన్‌లో షూటింగ్ ప్రారంభించుకోనుంది. కాగా ఈ చిత్రంలో జగపతిబాబు కీలకపాత్రను పోషిస్తున్నాడు అని తెలిసిన వెంటనే ఆయన ఎన్టీఆర్‌కు తండ్రిగా నటిస్తున్నాడంటూ వార్తలు షికారు చేశాయి. అయితే ఈ చిత్రంలో ఆయన తండ్రి పాత్రను చేయడంలేదు, విలన్‌పాత్రను చేయనున్నాడు. ఈ చిత్రంలో జగపతిబాబు విలనిజం చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.