ఏపికు చెందిన ఓ మంత్రిగారు అసభ్యంగా ప్రవర్తించడంతో విమానంలో శృతి హాసన్ కన్నీరు పెట్టిందని మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. వీటిని శృతి హాసన్ ఖండించింది. "ఓ గాడ్.. నవ్వొస్తుంది. నేను విమానంలో ఏడవలేదు. ఈ వార్త సిల్లీగా ఉంది. సాంబార్ లేదా మార్లోన్ బ్రాండోను మిస్ అయిన సమయంలో నేను ఏడుస్తాను." అంటూ శృతి హాసన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
మరోవైపు ఆరోపణలు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఓ ముఖ్యమైన విషయమై అర్జంటుగా ఫోనులో మాట్లాడుతుండగా ముందు సీటులో కూర్చున్న శృతి హాసన్, విమాన ప్రయాణ సమయంలో మాట్లాడవద్దని చెప్పింది. మీడియాలో ప్రచారం జరుగుతుందంతా అబద్దమే. అని మంత్రి తెలిపారు. శృతి హాసన్ స్టార్ హీరోయిన్ కావడంతో ఈ వార్తకు ఎక్కువ ప్రచారం లభించింది.