Advertisement
Google Ads BL

నాగ్‌ 'మైత్రి' పై మనసు మార్చుకున్నాడా?


కన్నడంలో  ఘనవిజయం సాదించిన ‘మైత్రి’ చిత్రం రీమేక్‌లో నాగార్జున నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని నాగ్‌ మీడియా ద్వారా ఖండిరచాడు. అయినా ఆ వార్తలు రావడం ఆగిపోలేదు. టాలీవుడ్‌లో నాగ్‌ ఆ చిత్రం రీమేక్‌లో నటించనున్నట్లు బలంగా వినిపిస్తోంది. ఈ చిత్రంలో నటించడానికి ఈ చిత్రం రీమేక్‌ హక్కులను పొందిన నాగార్జున స్నేహితుడైన జి.కె. అనే వ్యక్తి ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయడం కోసం నాగ్‌తో సంప్రదింపులు జరిపి ఆయన్ను ఒప్పించాడని సమాచారం. కన్నడలో ఈ చిత్రంలో నటించిన పునీత్‌రాజ్‌కుమార్‌ పాత్రను నాగ్‌ చేయనుండగా, మోహన్‌లాల్‌ పాత్ర కోసం ఎవరిని ఎంచుకోవాలా? అని వేట కొనసాగుతోంది. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ఈ చిత్రంలో ప్రధానపాత్రను పోషిస్తాడని.. దర్శకుడు ఎవరో అతి త్వరలో తేలిపోతుందని సమాచారం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs